హొరా హెరీగా జరిగిన మ్యచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి ఎదురైంది. కీవిస్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ లో అదే జోరు చూపించలేకపోయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ దూకుడుగా ఆడాడు. 50 పరుగులు చేసిన సుందర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో చివర్లో దూకుడుగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ 47; 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు రాణించాడు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, శాంటర్న్, ఫెర్గూసన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఇష్ సోధి, జాకబ్ చెరో వికెట్ తీశారు.మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ రాంచీ వేదికగా జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.