NDL: పాణ్యం మండలం నెరవాడ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. నంద్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.