తల్లి అయిన తర్వాత తన జీవితం మారిపోయిందని నటి కియారా అద్వాణీ పేర్కొంది. ఇప్పుడు తానొక ‘ఆడపులి’లా మారానని, మాతృత్వంతో తన ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపింది. పెళ్లయినా.. సిద్ధార్థ్‌తో తన బంధం, సరదా కబుర్లు ఏమీ మారలేదని, తామిద్దరం సినిమా ప్రేమికులుగా ఎన్నో విషయాలు చర్చిస్తామని చెప్పింది. ఓటమే ఉత్తమ గురువుగా భావించి, కథ నచ్చితే వెంటనే ఓకే చేస్తానని వెల్లడించింది.