Viral Video : జీవితంలో పెళ్లి ఒకసారే జరుగుతుంది. అందుకే చాలామంది తమ పెళ్లిని జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి రోజు అందరికీ గుర్తుండేలా వెరైటీగా, వింతగా, ఏదో కొత్తగా చేస్తుంటారు. ఈ మధ్య పెళ్లిళ్లలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు డ్యాన్స్ చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతోంది. కానీ.. ఈ పెళ్లికూతురు మాత్రం పెళ్లికొడుకుకు షాక్ ఇద్దామనుకుందో ఏమో కానీ.. పెళ్లికూతురు జడ మొత్తాన్ని పూలతో కాకుండా చాకొలేట్లతో అలంకరించుకుంది.
కిట్ కాట్, ఫైవ్ స్టార్, ఫెర్రెరో రోచర్, మిల్కీ బార్ లాంటి రకరకాల చాకొలేట్స్ తో పెళ్లికూతురు జడను తన హెయిర్ స్టయిలిస్టు అలంకరించింది. పెళ్లిళ్లలో సరికొత్తగా జడలను పూలతో అలంకరిస్తారు కానీ.. ఇలా కొత్తగా అది కూడా చాకొలేట్స్ తో చేయడం చూసి పెళ్లికొడుకుతో పాటు అతిథులు కూడా షాక్ అయ్యారట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఇలాంటి జడను ఎప్పుడూ చూడలేదని.. ఇది పిచ్చికి పరాకాష్ట అంటూ కామెంట్లు పెడుతున్నారు.