కోనసీమ: మరో రెండు రోజులు మార్చి 31 వస్తుందని అదే రోజు వడ్డీ మాఫీ సౌకర్యం ముగుస్తుందని పురపాలక సంఘం కమిషనర్ TV రంగారావు తెలిపారు. ఆదివారం సెలవు రోజు కూడా మునిసిపల్ సిబ్బంది మొండి బకాయిదారుల ఇళ్లకు వెళ్లి ప్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఇంకా రెండు రోజులు గడువు మాత్రమే ఉందన్నారు. 50% వడ్డీ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పన్నులు వెంటనే చెల్లించాలన్నారు.