మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌లో పర్యాటకుల సంఖ్య పెరిగిందని అక్కడ పర్యటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం లక్షద్వీప్ పర్యటించే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు.
Tourism Officer Imthias Mohammed: మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌లో పర్యాటకుల సంఖ్య పెరిగిందని అక్కడ పర్యటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం లక్షద్వీప్ పర్యటించే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్‌ను మోదీ సందర్శించారు. తర్వాత లక్షదీవుల అందాన్ని వివరిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే సాహసాలు చేయాలనుకునే వాళ్లు లక్షద్వీప్‌ను మీ లిస్ట్‌లో చేర్చుకోండని మోదీ తెలుపుతూ ఫొటోలు షేర్ చేశారు. దీంతో పర్యాటకుల సంఖ్య పెరిగిందని అక్కడ అధికారులు తెలుపుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర్ర మోదీ దేశంలో ప్రభావవంతమైన నాయకుడు. మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగింది. అంతర్జాతీయ, విదేశీ పర్యాటకులు ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీలు కోసం సంప్రదిస్తున్నారని ఇంతియాజ్ తెలిపారు. లక్షద్వీప్‌లో వివిధ పర్యాటక కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు అన్నారు. స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్ లక్షద్వీప్ టూరిజంలో ప్రధాన ఆదాయాన్ని అందించే విభాగాలని ఇంతియాజ్ తెలిపారు. భవిష్యత్తులో లక్షద్వీప్ మరిన్ని క్రూయిజ్ షిప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.