»Pawan Who Does Not Have A Doctorate Is The Reason
Pawan Kalyan: డాక్టరేట్ వద్దన్న పవన్.. కారణం అదే
తనకంటే గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అనేక రంగాల్లో రాణించిన చాలా మందిని వదిలిపెట్టి తనకు డాక్టరేట్ ఇవ్వడంపై పవర్ స్పందించారు. గౌరవంగానే తాను ఆ డాక్టరేట్ ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలతో గడుపుతున్నారు. ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టి టీడీపీతో కలిసి బరిలోకి దిగనున్నారు.
తాజాగా తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ కు డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం పవన్ కు ఇన్విటేషన్ కూడా పంపింది. డాక్టరేట్ కు పవన్ ను ఎంపిక చేసినట్లుగా తన ఇన్విటేషన్లో వేల్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే పవన్ మాత్రం ఆ డాక్టరేట్ ను తిరస్కరించారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
తనకంటే గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అనేక రంగాల్లో రాణించిన చాలా మందిని వదిలిపెట్టి తనకు డాక్టరేట్ ఇవ్వడంపై పవర్ స్పందించారు. గౌరవంగానే తాను ఆ డాక్టరేట్ ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.