ఉసిరి - ఆయుర్వేదంలో ఒక అద్భుత ఔషధం. శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరి ఒక గొప్ప మూలం. ఆయుర్వేదంలో ఉసిరిని చాలా గొప్పగా చెబుతారు. ఇది ఐదు రుచులను (పులుపు, ఘాటు, చేదు, ఆస్ట్రిజెంట్, తీపి) కలిగి ఉండటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఉసిరిలో విటమిన్ సి, క్రోమియం, జింక్, రాగి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్లనొప్పులకు మంచిది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉసిరిని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. మరి ఉసిరిని ఎలా తీసుకోవాలంటే?
ఉసిరి ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మలబద్దకాన్ని తగ్గిస్తుంది
జ్వరాన్ని తగ్గిస్తుంది
రక్తాన్ని శుద్ధి చేస్తుంది
ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
గుండెను బలపరుస్తుంది
కళ్లకు మంచిది
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
ఉసిరిని తీసుకునే విధానాలు: ఉసిరి రసం: ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ ఉసిరి రసాన్ని సగం గ్లాసు నీటిలో కలిపి తీసుకోవాలి. ఉసిరి పొడి: ఒక టీస్పూన్ ఉసిరి పొడిని తేనెలో లేదా గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపునే తీసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి: ఉసిరికాయతో చేసిన ఊరగాయ అన్నం, చపాతీలతో తీసుకోవచ్చు. ఉసిరి మిఠాయి: భోజనం తర్వాత రోజూ ఉసిరికాయ తీపి ముక్కలను తినవచ్చు. ఉసిరి మురబ్బా: జీర్ణ ప్రయోజనాలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరి మురబ్బా మంచిది.