Health Drinks : ప్రస్తుతం ప్రజలు తప్పుడు ఆహారపు అలవాట్లు, దిగజారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బిజీబిజీ గజిబిజి జీవితంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో బయట తింటానికే మొగ్గు చూపుతున్నారు. పగటిపూట అనారోగ్యకరమైన వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. రోజంతా ఎలాంటి వ్యాయామం చేయడం లేదు. దీంతో జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా గ్యాస్, మలబద్ధకం చాలా సాధారణ సమస్యలు. వీటి నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు మందులను ఆశ్రయిస్తున్నారు. వాటతో పాటు అనేక ఇంటి నివారణలను అనుసరిస్తున్నారు.
చాలా సార్లు, జీర్ణక్రియ లేదా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మారుతుంది. ప్రజలు దానిని వదిలించుకోవడానికి ఇంటి నివారణలను అనుసరించాలని కొంతమంది చెబుతుంటారు. అందుకోసం ప్రజలు అనేక పానీయాలు తీసుకుంటారు. నిమ్మరసం నీరు గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రముఖ డైటీషియన్ గుంజన్ తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. దీనిలో మలబద్ధకం, UTI, మధుమేహం, జీర్ణక్రియకు సంబంధించిన ఈ సమస్యల నుండి ఉపశమనం ఎలా పొందాలో చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చాలా మంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. దీంతో వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. సబ్జా గింజల నీరు దానిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. దీని కోసం, ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో సుమారు 15 నిమిషాలు నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.
అలాగే ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన అల్లంను 4 కప్పుల నీటిని ఒక పాత్రలో వేసి ఆ కనీసం 10 నిమిషాలు నీటిని మరిగించాలి. అలా మరిగిన నీటిని ప్రతి రోజు ఉదయం తాగాలి.
UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) సమస్య నుండి ఉపశమనం అందించడంలో బియ్యం నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, సగం కప్పు పచ్చి బియ్యం తీసుకోండి. తర్వాత దానిని పూర్తిగా కడగాలి. బియ్యాన్ని ఒక గిన్నెలో 2 నుండి 3 కప్పుల నీటితో 30 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు బియ్యం నీళ్లను శుభ్రమైన గిన్నెలో వేసి తాగాలి.
డయాబెటిస్‌లో మెంతి గింజల నీటిని తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని చేయడానికి పెనంపై మెంతులు వేసి వేడి చేయాలి. ఇప్పుడు గింజలను గ్రైండ్ చేయడం ద్వారా పొడిని సిద్ధం చేసుకోవాలి. ఈ పొడిని 1 టీస్పూన్ నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. ఏదైనా వ్యాధి చికిత్సకు ఔషధం చాలా ముఖ్యమైనది.