గర్భిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే గర్భదారణ సమయంలో తల్లి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చాలామంది కాకర కాయ చేదుగా ఉంటుందని పక్కన పెట్టేస్తుంటారు. కానీ కాకరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది.
Bittergourd : గర్భిణులు(pregnant) ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే గర్భదారణ సమయంలో తల్లి(Mother) సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చాలామంది కాకర కాయ(Bittergourd ) చేదుగా ఉంటుందని పక్కన పెట్టేస్తుంటారు. కానీ కాకరగాయ(Bittergourd )తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Benifits) కలుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది. గర్భధారణ సమయంలో కాకరకాయ తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
పోషకాలకు నిలయం
కాకరకాయలో ఇనుము(Iron), మెగ్నీషియం, పొటాషియం(potasium), విటమిన్ ఎ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శిశువు(Child) ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధికి ఈ పోషకాలు చాలా చాలా అవసరం.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
గర్భిణులు ఎక్కువగా మలబద్ధకం(Constipation), ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. కాకరకాయలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
ప్రెగ్నెన్సీ డయాబెటీస్(Diabetes) ఉన్న గర్భిణీ స్త్రీలకు కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. దీనిలో బ్లడ్ షుగర్ లెవెల్స్(Blood sugar levels) ను పెంచే కార్బోహైడ్రేట్లు(Carbohydrates) తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది
కాకరకాయలో ఫోలిక్ యాసిడ్(Folic acid~) పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకు, అభివృద్ధికి అవసరం. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ తగినంతగా తీసుకోవడం వల్ల శిశువులో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని కాకర కాయ తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తి పెంచుతుంది
కాకరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants), పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణుల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది గర్భిణీ స్త్రీలకు అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. తల్లి, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువును నియంత్రిస్తుంది
కాకరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్(Fiber) ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగకూడదంటే గర్భిణులు కాకరకాయ తినాలి. కాకరకాయ గర్భిణుల కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.
చర్మాన్ని ప్రకాశిస్తుంది
కాకరకాయ విటమిన్ సి (Vitamin C)కి గొప్ప మూలం. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి చాలా అవసరం. గర్భిణులు కాకరకాయను తినడం వల్ల మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.