Ladies Romance : ఈ మధ్య కాలంలో చాలామందికి కరోనా(Corona) కంటే పెద్ద వ్యాధి సోకింది. అదే సోషల్ మీడియా(Social media)లో ఫేమస్ కావడం.. అందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. సాధారణంగా లవర్స్(Lovers) బైకులపై రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పట్టుబడ్డారన్న వార్తలు(News) నిత్యం మనం చూస్తున్నాం. కానీ ఇద్దరు యువతులు అందుకు భిన్నంగా ఆలోచించారు. నడిరోడ్డు(Road)పై బైకు పై ముద్దులు(Kiss), హగ్గు(Hug)లతో రెచ్చిపోయారు. వారు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నడి రోడ్డుపై ఇద్దరు యువతులు రెచ్చిపోయారు. మగవాళ్లకు మేము తక్కువ కాదని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. కదులుతున్న బైక్ పై ఎదురెదురుగా కూర్చొని హగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ చెలరేగిపోయారు. డ్రైవ్(Drive) చేస్తూ బైక్ వదిలేసి మరీ ఈ లిప్ లాక్ లతో వెర్రి చేష్టలకు తెగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్ స్టా గ్రామ్(Instagram) ఖాతాలో వైరల్(Viral) అయింది. అయితే ఈ వీడియో వైరల్ గా మారిన తర్వాత వివాదమో, మరే కారణమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో అందుబాటులో లేదు. కానీ నెటిజన్లు ఊరుకోరు కదా.. వెంటనే స్క్రీన్ షాట్ల(Screen Shots)ను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఆ బైక్ తమిళనాడు నంబర్ ప్లేట్‌తో కనిపించగా.. ఇది జార్ఖండ్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో డిలీట్ చేసే సమయానికే 30 వేల లైకులు(like), 5 లక్షల 74 వేల మందికు పైగా వీక్షించారు. ఈ వీడియో(Video)పై కొంత మంది ఫన్నీగా రిప్లై ఇస్తుంటే.. మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ’ఫేమస్ కావాలంటే మరీ ఇంతలా దిగజారాల్సిన అవసరం లేదు’ నెటిజన్లు ఫైర్ అయ్యారు.