Tokyo-Haneda Airport: జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రజలు భవనాల కింద శిధిలమయ్యారు. పదుల సంఖ్యలో మరణాలు, చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టమయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగి రోజు గడవక ముందే జపాన్‌లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఎల్ 516 విమానం ప్రమాదానికి గురైంది. రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్ వేపై దిగుతుండగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్లైట్ అదుపు తప్పి పక్కనే పార్క్ చేసిన కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో ఆ విమానంలో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరిని బయటకు అయితే చేర్చారు. కానీ ఇందులో ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియదు.
Japan Airlines plane, an Airbus A350, now completely engulfed in flames at Tokyo Airport. All nearly 400 passengers have been evacuated pic.twitter.com/Jlp8cSa5Fg