»Modi Govt Appoints Arvind Panagariya As Chairman Of 16th Finance Commission Detail Is Here
Finance Commission: 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గ పనగరియా
నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బాధ్యతను అప్పగించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనగారియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది.
Finance Commission: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బాధ్యతను అప్పగించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనగారియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.
ఫైనాన్స్ కమిషన్ పని ఎలా ఉంటుంది?
16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు (Torms of Reference-ToR) గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం కోసం ప్రస్తుత ఏర్పాట్లను సమీక్షిస్తుంది. అలాగే కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయ పెంపు చర్యలను సూచిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, ఇది కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సలహాలను ఇస్తుంది. 2021-22 నుండి 2025-26 వరకు ఐదేళ్ల కాలంలో కేంద్రం విభజించదగిన పన్ను పూల్‌లో 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని గతంలో ఎన్‌కె సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
అరవింద్ పనగారియాను భారత ప్రభుత్వం మార్చి 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది. అతను 30 సెప్టెంబర్ 1952 న జన్మించాడు. ప్రపంచ బ్యాంక్, IMF, UNCTAD వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రొఫెసర్ పనగారియా ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశారు. డా. పనగారియా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు. కొలంబియా యూనివర్సిటీలో ఇటీవల ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పనగరియా నలంద విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. దీనికి ముందు ప్రొ. పనగరియా నలంద విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యునిగా ఉన్నారు.