new ration cards process in telangana from december 28th 2023
రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు అధికారులు రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రేషన్ కార్డు కేవైసీని తెలంగాణ సర్కార్ చేపట్టింది. ఈ పాస్ యంత్రం ద్వారా ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకోవాలని గతంలో కూడా బీఆర్ఎస్ సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
రేషన్ కార్డు లబ్దిదారులు జనవరి 31వ తేదిలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్లు ఈ కేవైసీని సేకరిస్తున్నట్లు తెలిపారు.
కేవైసీకి సంబంధించి ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, ఐ రిష్ వంటి గుర్తింపు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా శనివారం నాటికి కేవైసీ ప్రక్రియ 70.80 శాతం పూర్తయ్యిందని దేవేందర్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇంకా 30 శాతం మంది వెంటనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. వనపర్తి జిల్లాలో అతి తక్కువగా 54.17 శాతం ఈ కేవైసీ పూర్తయినట్లు వెల్లడించారు.