W.G: జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.