»Centers Key Decision On Rice Good News For Common People
Rice: రైస్‌పై కేంద్రం కీలక నిర్ణయం..సామాన్యులకు గుడ్ న్యూస్
సన్నబియ్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. భారత్ బ్రాండ్ రైస్ పేరుతో సన్న బిర్యాన్ని కేజీ 25 రూపాయలకే అందించేందుకు సిద్ధమైంది.
సామాన్యులకు సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వరకూ భారత్ బ్రాండ్ పేరుతో గోధుమ పిండి, శనగపప్పును కేంద్రం డిస్కౌంట్ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలోకి సన్న బియ్యాన్ని కూడా తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందుకోసం సన్న బియ్యం ధరల కట్టడికి కేంద్రం అడుగులు వేస్తోంది.
కేజీ 25 రూపాయల సబ్సిడీతో సన్నబియ్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రణాళిక వేస్తోంది. ఇప్పుడున్న మార్కెట్లో ఈ సన్న బియ్యం కేజీ 60 నుంచి 65 రూపాయల వరకూ పలుకుతోంది. దీంతో భారత్ బ్రాండ్ రైస్ పేరుతో సన్న బియ్యాన్ని కేజీ 25 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం విక్రయించేందుకు సిద్దమవుతోంది.
భారత్ బ్రాండ్ కింద ఇప్పటికే శనగపప్పు రూ.60, గోధుమ పిండి రూ.27.50లకు విక్రయిస్తోంది. ఇకపై ఆ లిస్టులోకి సన్న బియ్యం కూడా చేరనుంది. దేశంలో ఆహార పదార్థాలను అధిక ధరలకు కాకుండా సామాన్యులకు అందుబాటు ధరల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఎగుమతులపై పలు నిబంధనలను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.