HYD: తెలంగాణలో వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇవ్వడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 950 సహకార సంఘాల పరిధిలో జాతీయ రహదారుల వెంట ప్రతి 50 కిలోమీటర్లకు ప్రభుత్వ భూముల్లో ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. HYD జాతీయ రహదారుల్లోనూ వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు.