»Vinod Kumar Aiims Came About Because Of The Brs Government
Vinod Kumar: బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఎయిమ్స్ వచ్చింది
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిసి నిధుల గురించి వివరించడం సంతోషమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Vinod Kumar: తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిసి నిధుల గురించి వివరించడం సంతోషమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో కేసీఆర్ చాలాసార్లు మోదీని కలిశారు. ప్రతిసారి చూస్తామన్నారు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. విభజన చట్టంలో భాగంగా రహదారుల విషయంలో ఎన్నోసార్లు కోరిన ఒక్క హామీ కూడా కేంద్రం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రహదారుల విషయంలో ఎన్నోసార్లు పార్లమెంట్లో మాట్లాడామని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లేఖలే కాంగ్రెస్ పార్టీ మరోసారి అవే లేఖలను మోదీకి ఇచ్చిందన్నారు. ఇవాళ బీబీనగర్‌లో ఎయిమ్స్ వచ్చిందంటే దానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాట చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బుల్లెట్ ట్రైన్లన్నీ నార్త్ స్టేట్లకు మాత్రమే ఇచ్చారు. హైదరాబాద్, విజయవాడ, మద్రాస్ వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని అడిగామని తెలిపారు. విభజన చట్టంలో చెప్పిన, చెప్పని హామీల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. మోదీకి కేసీఆర్ ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదు. అందుకే అప్పటి నుంచి ప్రధానిని కలవలేదని తెలిపారు.