NRML: పట్టణంలోని ఓ వైద్యుడిపై దాడి చేసిన కేసులో సల్మాన్, షౌకత్, షాబాద్ అలీ, ఆజాద్ హుస్సేన్ అనే నలుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తప్పుడు బిల్లులు ఇవ్వాలని డాక్టరుపై ఒత్తిడి తెచ్చి, ఆయన నిరాకరించడంతో ఈ దాడికి పాల్పడ్డారు. వైద్యులపై దాడులు చేసే వారిని ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.