ప్రకాశం: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బేస్తవారిపేటలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత, వ్యర్థాల వర్గీకరణపై అధికారులు అవగాహన కల్పించి, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జితేంద్ర, ఎంపీడీవో రంగనాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.