SKLM: నరసన్నపేట RTC కాంప్లెక్స్‌లో వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు స్థానిక ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను నరసన్నపేట TDP సమన్వయ కర్త బగ్గు అర్చన శనివారం ప్రారంభించారు. స్వచ్ఛందంగా సంస్థ సభ్యులు ముందుకు రావడం సంతోష దాయకమన్నారు. రానున్న వేసవిలో గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.