NLG: విద్యార్థుల ఉల్లాసం కోసం ఏపూర్ 1వ వార్డు సభ్యులు వెంకటేశం తమ ఉదారతను చాటుకున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఆయన ఆట వస్తువులను సమకూర్చారు. వీటిని సర్పంచ్ పాలెం మహేష్ చేతుల మీదుగా సోమవారం విద్యార్థులకు అందజేశారు. పాఠశాల సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు హెచ్ఎం అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.