»National Sports Awards 2023 Arjuna Award For Pacer Shami
National Sports Awards 2023: పేసర్ షమీని వరించిన అర్జున అవార్డు!
2023కి గాను అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. మొత్తం 26 మందికి అర్జున అవార్డులు వరించగా.. అయిదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు వరించాయి.
National Sports Awards 2023: ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులతో గౌరవించింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ద్రోణాచార్య, ఖేల్ రత్న, అర్జున అవార్డు విజేతలను ప్రకటించింది. మొత్తం 26 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు ఎంపిక చేసింది. అలాగే అయిదుగురు అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులకు ఎంపిక చేసింది. అందులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. వరల్డ్ కప్‌లో టీమిండియా తరుఫున అద్భుత ప్రదర్శన చేయడంతో షమీకి అర్జున అవార్డు వరించింది. ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డుకు బ్యాడ్మింటన్ జంట చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డులను జనవరి 9న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోకున్నారు.
ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న కోచ్‌లు: లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్బీ రమేశ్ (చెస్), మహవీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేషన్ ప్రభాకర్ (మల్లఖంబ్)కి ఈ అవార్డు వరించింది.