Two Passengers Get Into A 'Boxing Match' In Delhi Metro
Delhi Metro: ఢిల్లీ మెట్రో (Delhi Metro) అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఇందులో కొందరు పాటలు పాడతారు, ఆటలు ఆడతారు. డ్యాన్స్‌లతో హోరెత్తిస్తారు. ఓ యువతి డ్రెస్సింగ్ కూడా అప్పట్లో చర్చకొచ్చింది. ఇప్పుడు మరో ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. అవును.. ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ఇద్దరు ఫైట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది.
10 సెకన్ల నిడివి గల వీడియోలో ఇద్దరు కంటిన్యూగా కొట్టుకునే కనిపించారు. ఆ మెట్రో రైలు బోగీలు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నామని.. ఎన్నడూ తమకు ఇలాంటి ఘటన ఎదురు కాలేదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
మెట్రో ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు వేగంగా చేర్చుస్తున్నారు. పని ఒత్తిడిలో ఉండే జనాలను సురక్షితంగా చేర్చడంపై మెట్రో దృష్టిసారించాల్సి ఉంది. ఇతర సిటీలలో మెట్రో సర్వీస్ ఇస్తోంది. కానీ ఢిల్లీ మెట్రోలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. లా కొందరు ప్యాసెంజర్స్ కొట్టుకుంటే మిగతా ప్రయాణికుల భద్రత సంగతి ఏంటనే ప్రశ్న వస్తోంది. దీనిపై అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.