KMM: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సభల సందర్భంగా ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ పై ఫోటో ఎగ్జిబిషన్‌ను PDSU ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత స్వతంత్ర ఉద్యమంలో పోరాడి ప్రాణాలు వదిలిన మహనీయులను గుర్తు చేసుకోవాలని PDSU జిల్లా కార్యదర్శి మంగతాయి, PYL జిల్లా కార్యదర్శి భరత్ పిలుపునిచ్చారు.