WGL: రాయపర్తి మండల శివారు హిందుస్తాన్ పెట్రోల్ బంకు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. అందులో సుమారు రూ.10 లక్షల విలువైన 20 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఒడిశాకు చెందిన యువకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజేందర్ తెలిపారు.