PPM: మాతా-శిశు ఆరోగ్య శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కరరావు సూచించారు. గర్భిణీ, బాలింతలు, శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించి మరణాలు నివారించాలని అన్నారు. ఆశా నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో గర్భిణీల నమోదు, టీకాల పురోగతి, హెచ్పీవీ వ్యాక్సిన్ 100% అమలు పై దృష్టి సారించాలని ఆదేశించారు.