మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త. ఈ ఏడాది ఐపీఎల్- 2023లో ధోనీ ఆడతాడో లేదోననే ఆందోళన ఇక తీరినట్టే. ధోనీ మరోసారి ఆడాలనే అభిమానుల కోరిక నెరవేరుతున్నట్లు తెలుస్తున్నది. మరోసారి ఐపీఎల్ సీజన్ లో ధోనీ మెరువనున్నట్లు కనిపిస్తున్నది. మరోసారి బ్యాట్ పట్టాలని కోరుతున్న అభిమానులను నిరుత్సాహపరచడం ఇష్టం లేక మహీ భాయ్ మరోసారి ఐపీఎల్ లో మెరవడం ఖాయమని తెలుస్తున్నది. ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నడని సమాచారం. ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
నాలుగుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ధోనీ మరో సీజన్ ఆడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. రాంచీలోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నెట్స్‌లో ధోనీ సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంటే ధోనీ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడని తెలుస్తున్నది. ధోనీ అన్ని ఫార్మాట్లో క్రికెట్ కు వీడ్కోలు పలికినా ఇంకా ఐపీఎల్ కు అధికారికంగా విరామం ప్రకటించలేదు. గత సీజన్ చివరి సారి అనుకున్నారు.. కానీ గత సీజన్ లో సీఎస్కే ట్రోఫీ సాధించలేదు. చెన్నైకి ట్రోఫీ సాధించే ధోనీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. అభిమానులు, క్రికెట్ నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. అనుకున్నట్టుగానే ధోనీ మరోసారి ఐపీఎల్ లో మెరిసే అవకాశం ఉంది. అయితే వయసు మీద పడడంతో ధోనీ ఏమాత్రం ప్రదర్శన చేస్తాడో చూడాలి.
ఇక చెన్నై జట్టులో కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా సిద్ధమవుతున్నాడు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకొని మళ్లీ టోర్నీలకు సిద్ధమవుతున్నాడు. చెన్నై జట్టు ఈసారి ఐపీఎల్ లో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ధోనీ పరోక్ష సారథ్యంలో రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రుతురాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. దీనికి తోడు మినీ వేలంలో రూ.16.25 కోట్లతో కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు కొండంత బలంగా నిలువనున్నాడు. దీంతో ఈసారి కప్ మనదే అని చెన్నై అభిమానులు ఆశాభావంతో ఉన్నారు.