KNR: సీడీఎంఏ నిధుల కింద మంజూరైన రూ.50 కోట్ల నిధుల టెండర్ల రద్దును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన బీజేపీ పాలకవర్గం నగరంలో డివిజన్ల అభివృద్ధి అడ్డుకుంటోందని ఆరోపించారు.