SRPT: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో అశోక్ తెలిపారు. జిల్లాలోని 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,364 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,349 మంది హాజరయ్యారు. నలుగురు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, డీఈవో 36 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా సాగాయని అన్నారు.