ADB: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను జిల్లా SP అఖిల్ మహాజన్ శనివారం అందజేశారు. 30 రోజుల వ్యవధిలో 105 మొబైల్ ఫోన్లు రాబట్టి బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని SP అఖిల్ కోరారు.