KMR: బిచ్కుంద పట్టణ కేంద్రంలో శుక్రవారం శ్రీరామనవమి పురస్కరించుకుని హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర కనులపండుగుగా జరిగింది. శ్రీరామ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాషాయ జెండాలు ధరించి, ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య డీజే పాటలకు యువత నృత్యాలు చేశారు.