»Uttar Pradesh Cancellation Of No Coaching Orders For Girls After 8 Pm
Uttar Pradesh: ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న యోగి సర్కార్
బాలికలకు రాత్రి 8 గంటల తర్వాత కోచింగ్ ఇవ్వకూడదని గతంలో యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చింది. విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ.. తాజాగా కొత్త ఉత్తర్వులను ప్రకటించింది.
Uttar Pradesh: కొన్ని పాఠశాలలు సమయం అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ క్లాస్‌లు చెబుతుంటాయి. గతంలో యూపీ ప్రభుత్వం బాలికలకు రాత్రిపూట కోచింగ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రాత్రి 8 గంటల తర్వాత బాలికలకు తరగతులు నిషేధం అని స్పష్టంచేసింది. ప్రస్తుతం ఆ ఉత్తర్వులను యూపీ సర్కార్ రద్దు చేసింది. నోయిడాలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఆగస్టు 30వ తేదీ నుంచి అమల్లో ఉన్న నిబంధనలపై విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో యోగి సర్కార్ తలొగ్గింది.
గతంలో ఉన్న నిబంధనలను రద్దు చేస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని అశిలేఖ్ కుమార్ మిశ్రా కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద అన్ని ఉన్నత విద్యా సంస్థలు 100 శాతం సీసీటీవీ కెమెరాలు ఉండాలని పేర్కొంది. విద్యా సంస్థల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతోపాటు క్యాంపస్, బోధనా తరగతి గదులు, గ్యాలరీ, వరండా, ప్రధాన ద్వారం, హాస్టళ్లలో సీసీటీవీ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నింటి కంటే ముఖ్యంగా కోచింగ్ సెంటర్లలో బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.