»Gang Rape Of An Ex Govt Officers Daughter In A Car 3 Arrested Within 12 Hours Lucknow Uttar Pradesh
Gang rape: కారులో ఓ అధికారి కుమార్తెపై గ్యాంగ్ రేప్..12 గంటల్లోనే ముగ్గురు అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో సోమవారం కదులుతున్న కారులో 22 ఏళ్ల ప్రభుత్వ అధికారి కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ముగ్గురు నిందితులను 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
Gang rape of an ex govt officers daughter in a car 3 arrested within 12 hours lucknow uttar pradesh
కదులుతున్న కారులో ఓ మాజీ ప్రభుత్వ అధికారి కుమార్తై(22)పై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్(uttar pradesh) రాజధాని లక్నోలో కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కేవలం 12 గంటల్లో పట్టుకున్నారు. డిసెంబర్ 5న రాత్రి కదులుతున్న కారులో మాజీ ప్రభుత్వ అధికారి కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులు సోమవారం రాత్రి బజార్ఖాలా ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వారిపై వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 376D/342/328/323/504/506 కింద కేసులు నమోదు చేశారు.
సమాచారం ప్రకారం బాధితురాలి తండ్రి లక్నోలో సీనియర్ పోస్ట్‌లో ఉన్నారు. ఆ మహిళ కొంతకాలంగా చికిత్స పొందుతున్న కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) ఆసుపత్రిలోని సైకియాట్రీ విభాగాన్ని సందర్శించింది. ఆ క్రమంలో ఆమె తన ఫోన్(mobile)కి ఛార్జింగ్ పెట్టడానికి తరచుగా టీ విక్రేత సత్యం మిశ్రా నుంచి సహాయం కోరేది. దీంతో అతను అక్కడే ఆగి ఉన్న ఓ అంబులెన్సులో అతను ఆమె ఫోన్ చార్జింగ్ పెట్టాడు. ఆ క్రమంలోనే అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ నేపథ్యంలోనే వెగ్నార్ కారులో ఆమెను కూర్చోబెట్టుకుని అంబులెన్స్ కోసం వెళ్లారు. ఆమెతోపాటు ఫోన్ ఛార్జ్ చేయడానికి అంబులెన్స్‌కి వచ్చిన సత్యంతో మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. బారాబంకి సఫేదాబాద్ సమీపంలోని ధాబాకు ఆమెను తీసుకెళ్లారు. అక్కడ వారు ఆమెకు బలవంతంగా మత్తు పదార్థాలు తాగించారు. తర్వాత అక్కడి నుంచి ఆమెన మళ్లి కారులో కూర్చొబెట్టుకుని హైవేపైకి వెళ్తుండగా ఆమెపై అత్యాచారం(Gang rape)చేశారు. ఆ తర్వాత నిందితులు బాలికను పాలిటెక్నిక్ కూడలిలో వదిలిపెట్టారు. దీంతో ఆమె ఇందిరా నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన సత్యం, అస్లాం, సుహైల్‌లను వజీర్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు.