RR: జిల్లా పరిధిలో అనేక చోట్ల HPV వాక్సినేషన్ ప్రారంభించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు బాలికలకు అందిస్తున్నారు. రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొండాపూర్ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ప్రాంతాల్లో వీటిని అందిస్తున్నారు. తల్లిదండ్రులతో ప్రతి ఒక్కరు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు.