»School In Bandlaguda A Student Wearing Ayyappa Mala Is Not Allowed To Enter The School
Ayyappa mala: అయ్యప్ప మాల ధారణ స్కూల్ యాజమాన్యం నో ఏంట్రీ!
అయ్యప్ప మాల ధరించిందని రాజేంద్రనగర్‌లోని ఓ ప్రయివేట్ స్కూల్ విద్యార్థినిని తరగతి గదిలోకి అనుమతించలేదు. దీంతో ఆ స్టూడెంట్ గంటపాటు బయటే నిలబడింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
school in Bandlaguda, a student wearing Ayyappa mala is not allowed to enter the school
Ayyappa mala: హైదరాబాద్ బండ్లగూడ(Bandlaguda)లోని ఓ ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం చేసిన నిర్వాహకంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయ్యప్ప మాల( Ayyappa mala) ధరించిన విద్యార్థిని(student)ని తరగతి గదిలోకి అనుమతించలేదు. దీంతో ఆ చిన్నారిని దాదాపు గంట వరకు బయట వెయిట్ చేసింది. మాల వేసుకుంటే పాఠశాలకు అనుమతి లేదని, కేవలం స్కూల్ దుస్తుల్లోనే రావాలని ప్రిన్సిపల్ చేప్పారట. విషయం తెలుసుకున్న తండ్రి స్కూల్‌కు వచ్చి టీచర్స్‌తో మాట్లాడారు. పాఠశాల నియమాల ప్రకారం కేవలం యూనిఫామ్ ఉంటేనే అనుమతిస్తామని చెప్పారట. మాల వేసుకుంటే స్కూల్ డ్రెస్ వేసుకోవడం ఎలా కుదురుతుందని, ఇలా వస్తే మీకొచ్చిన సమస్య ఏంటని తండ్రి యాజమాన్యాన్ని నిలదీశారు.
శీతాకాలంలో చాలా మంది భక్తులు అయ్యప్ప మాల ధరిస్తుంటారు. అలాగే చిన్న పిల్లలు మాలలు ధరిస్తారు. వారిని కన్య స్వాములు అంటారు. రాజేంద్ర నగర్ బండ్లగూడలోని ఓ ప్రయివేట్ స్కూల్లో పూర్వీ అనే అమ్మాయి 4వ తరగతి చదువుతుంది. ఈ రోజు తను మాల ధరించింది. పాఠశాలకు వెళ్తే క్లాస్ టీచర్ తన మాలను చూసి ప్రిన్సిపల్‌కు తెలియజేసింది. యూనిఫామ్‌లోనే అనుమతిస్తామని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో పాప గంటకు పైగానే ఎండలో వెయిట్ చేసింది. అక్కడి వచ్చిన రిపోర్టర్ ఒకరు తనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. తరువాత పాప తండ్రి టీచర్స్‌తో మాట్లాడితే వాళ్ల రూల్స్ ఒప్పుకోవు అని చెప్పారట. ఈ ఘటనకు వీడియో తీసేందుకు ప్రయత్నిస్తే యాజమాన్యం అడ్డుకుందంటూ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే తమకు సరియైన సమాధానం కావాలంటూ నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.