BDK: భద్రాద్రి సీతారాముల కళ్యాణం మిథిలా స్టేడియంలో వైభవంగా జరిపారు. పూజా కార్యక్రమం, అలంకరణతో పెళ్లి కొనసాగించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. భద్రాచలం ఆలయం సర్వాంగ సుందరంగా అలంకరించబడగా, భక్తుల రాకపోకలతో క్షేత్రం కిక్కిరిసిపోయింది.