ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పలుప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు అర్జీదారులు తరలివచ్చారు. మంత్రి ఓపిగ్గా సమస్యలను విని సంబంధిత అధికారులతో సమస్యలపై చర్చించారు. వీలైనంతవరకు సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులకు సూచించారు.