»These Are The Ministers Who Will Take Oath With Revanth Reddy
Revanth Reddyతో ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీరే!
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరి కొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాళ్లు ఎవరంటే?
Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదారాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1:04 నిమిషాలకు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరి కొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి.. రేవంత్ రెడ్డితో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క, మాదిగ వర్గం నుంచి దామోదర రాజనరసింహ, ఎస్టీ వర్గం నుంచి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గే, ఇండియా కూటమి నేతలు, స్టాలిన్, మమతా బెనర్జీ, పీసీసీ చీఫ్లు, ఎమ్మెల్యేలు, 300 మంది అమరవీరుల కుటుంబాలు, మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులు, ఇతర రాష్ట్రాల నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి రానున్నారు.