AP: వడ్డెర్లకు ఇచ్చిన హామీలను మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని మంత్రి సవిత అన్నారు. నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మైనింగ్ లీజుల్లో వడ్డెర సొసైటీలకు 15 శాతం కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర పండుగగా వడ్డె ఓబన్న జయంతిని గుర్తించినట్లు చెప్పారు. ఈ క్రమంలో మంత్రి సవితకు వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు ధన్యవాదాలు తెలిపారు.