VZM: గజపతినగరంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయాల ప్రాంగణంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. సీనియర్ న్యాయవాది ఉప్పలపాటి రమేష్ దంపతులతో పాటు పలువురు కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సన్నివేశాన్ని ఆసక్తిగా తిలకించారు.