PPM: కురుపాం మండలం పి.లేవిడిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని శ్రీరామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు కలిసి భక్తులకు అన్నదానం నిర్వహించగా, గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.