ఉమ్మడి కృష్ణాలో సాగు, తాగునీటి కాలువల పూడికతీత పనుల నిధుల కేటాయింపు రాజకీయ దుమారం రేపుతోంది. క్షేత్రస్థాయి సమస్యల తీవ్రతతో సంబంధం లేకుండా, ప్రతి నియోజకవర్గానికి సరాసరి రూ.2.5 నుంచి రూ.3.5 కోట్ల వరకు కేటాయించడంపై కొందరు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కాగా, రూ.40 కోట్లతో ప్రాధాన్యత క్రమంలో పిచ్చిమొక్కల తొలగింపు, పూడికతీత పనులు చేపడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.