MLG: డ్రైనేజీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సూచించారు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాకింగ్లో భాగంగా ఆయన ఏటూరునాగారం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ పనులను పరిశీలించారు. నీటి ప్రవాహం సాఫీగా ఉండాలని, సరైన లెవెలింగ్ చూసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు.