Revanth Reddy: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ(Revanth Reddy) తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ పార్టీ(Congress) గెలిచిందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి వంటి బాహుబలి తెలంగాణ ఉన్న కారణంగానే కాంగ్రెస్ గెలిచిందని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. తెలంగాణలో గెలుపుకు కారకులైన స్టార్లందరికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ థాంక్స్ చెప్పాలని రాంగోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కారణమని రాంగోపాల్ వర్మ తన అభిప్రాయం వెల్లడించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కాబోతున్నారని తెలిసి.. కాంగ్రెస్ పార్టీపై ఎన్నడూ లేనంత గౌవరం పెరిగిందని మరో ట్వీట్లో రాంగోపాల్ వర్మ(RGV) తన సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డితో గతంలో దిగిన ఓ ఫోటోను ఆర్జీవీ ట్వీట్ చేశారు.