ATP: గుత్తి పట్టణంలోని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ సమీపంలో గల పాల డైరీలో శుక్రవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. పాల డైరీ తాళాలు పగలగొట్టి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.10వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.