ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ ట్రైలర్ టాప్ ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సలార్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.
ట్రైలర్ కూడా అదిరిపోయింది కాబట్టి.. ప్రభాస్ దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కావడం గ్యారెంటీ అంటున్నారు. 24 గంటలు గడవక ముందే 100 మిలియన్స్ వ్యూస్ టచ్ చేసింది సలార్. ఈ లెక్కన సలార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూవీ షూటింగ్‌ను కేవలం 114 రోజుల్లోనే కంప్లీట్ చేశాడట ప్రశాంత్ నీల్. సలార్ సినిమా చేయాలనే ఆలోచన 15 ఏళ్ల క్రితమే మదిలో మెదిలింది, కానీ ‘ఉగ్రమ్’ చేసిన తర్వాత KGFతో బిజీ అయ్యాను. సినిమా చేయడానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా 114 రోజుల్లో సలార్ షూటింగ్ కంప్లీట్ చేశామని తెలిపాడు ప్రశాంత్ నీల్.
హైదరాబాద్‌లో గల రామోజీ ఫిల్మ్ సిటీతో మేజర్ పార్ట్ షూట్ చేశాం. సింగరేణి మైన్స్లోను షూట్ చేశాం. అంతేకాదు.. సౌత్ పోర్ట్స్, మంగళూరు పోర్ట్, వైజాగ్ పోర్ట్‌లో కూడా షూటింగ్ చేసాము. ఇది కాకుండా యూరప్‌లో ఓ చిన్న భాగాన్నిచిత్రీకరించాం.. అని తెలిపాడు.