మహబూబ్నగర్ పట్టణంలోని 46వ డివిజన్లో మత సామరస్యం వెల్లివిరిసింది. నేడు జరగనున్న శ్రీరామనవమి వేడుకల కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ తన వంతుగా ప్రత్యేక వీధిలైట్లను ఏర్పాటు చేయించారు. ప్రతి ఏడాది హిందూ పండుగలకు స్వచ్ఛందంగా సహకారం అందించే ఆయన, ఈసారి కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా లైటింగ్ వ్యవస్థను సిద్ధం చేశారు.