AP: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ధర్మానికి మూర్తీభవించిన రూపం శ్రీరాముడనే విస్తృతార్థంలో ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని చెబుతుంటాం. ధర్మం, నీతి, ఆదర్శ జీవనానికి శ్రీరాముడు ప్రతీక. అందుకే వాడవాడలా నవమి వేడుకలను రామపారాయణం చేస్తూ సీతారాముల కళ్యాణ్‌ని ఘనంగా నిర్వహించే సంస్కృతి మనలో ఇమిడిపోయింది’ అని ట్వీట్ చేశారు.