VSP: ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో వెంకటరావు తదితర అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను సందర్శించారు.